కుల వివక్షపై చట్ట సవరణకు బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరణ
కులాన్ని ఒక వివక్ష రూపంగా పరిగణించాలని ,ఇందుకోసం చట్ట సవరణ చేయాలని వచ్చిన ప్రతిపాదనను బ్రిటీష్ పార్లమెంట్ తిరస్కరించింది. మంగళవారం దిగువ సభ (హౌస్ ఆఫ్ కామన్స్ ) ఈ సవరణ ప్రతిపాదనపై ఓటింగ్ జరిగింది. ప్రతిపాదనకు వ్యతిరేకంగా 307 ఓట్లు పడగా అనుకూలంగా 243 ఓట్లు వచ్చాయి.