కుల వృత్తులు కాపాడుకోవాలిగూడూరు నారాయణ రెడ్డి……….
జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 14 వలిగొండ మండల పరిధిలోని గోకారం,నేమిలి కాల్వ,జాలు కాల్వ గ్రామలలోని రజక మరియు నాయి బ్రాహ్మణ కులాలకు వృత్తికి సంబంధించిన పనిముట్లను గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతు దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఏకగ్రీవ తీర్మానాన్ని చూస్తే హాస్యాస్పదంగా ఉందని ముందుగా కేసీఆర్ హైదరాబాదులో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన కెసిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు సర్పంచ్ తుర్కపెల్లి మాధవి , గుండు దానయ్య , బిజేపీ ఇంచార్జి బైరు మల్లేష్ విరమళ్ళ శ్రీశైలం, బాషయ్య,రాధారపు మల్లేష్ గొలనుకొండ అశోక్,పబ్బు రమేష్ బొడ్డు కాటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Attachments area