Wednesday, 4 November 2026

కూకట్ పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

*బంగారు బతుకమ్మతో నాయినేని శ్రీ వైష్ణవి

కూకట్ పల్లి జనంసాక్షి :తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో ఘనంగా జరుపుకున్నారు.శనివారం బతుకమ్మ పండుగ ఏడవ రోజును వేపకాయల బతుకమ్మగా జరుపుకున్నారు.బతుకమ్మను తంగేడు, గునుగు,చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఒక్కెసి పువ్వేసి చందమామ… ఒక్క జాములాయే చందమామ అంటూ మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆడుతూ ..పాడుతూ వైభవంగా బతుకమ్మ ఆటలు ఆడారు.అనంతరం సమీప కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం సకినాల పిండిని వేపకాయల చేసి గౌరీ మాతకు నైవేద్యంగా నివేదించారు.