Wednesday, 4 November 2026

కూతురిని కడతేర్చిన తండ్రి

బీర్కూర్‌ గ్రామీణం: మండలంలోని దుర్కి గ్రామంలో ఈరోజు ఉదయం 14 నెలల వయస్సున్న కన్నకూతురిని తండ్రే కడతేర్చిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గోపన్‌పల్లి నడిపిగంగారం అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తె ఉన్నారు. కూతురు పుట్టడం ఇష్టలేకపోవడంతో ప్రతిరోజు గంగారం భార్యతో గొడవపడుతున్నాడు. కూతురిని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఈరోజు ఉదయం కుమారులు చూస్తుండగానే కూతురు మమతను గొంతు నులిమి హత్య  చేసాడు. తమ చెల్లెలిని తండ్రే చంపాడని కుమారులు చెప్పడంతో స్థానికులు గంగారాంను పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *