కూనంనేని అభినందన సభను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్

టేకులపల్లి సెప్టెంబర్ 15( జనం సాక్షి ): సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభినందన సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గూగులోత్ రామచందర్ కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభినందన సభ కొత్తగూడెం క్లబ్బులో 16వ తేదీన జరుగుతుందని తెలిపారు. సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామం నుండి జరిగే స్వాగత ర్యాలీని విజయవంతం చేయాలని టేకులపల్లి మండల కార్యవర్గ సమావేశంలో తెలిపారు. ఉదయం 9 గంటలకు నాయకులగూడెం నుండి బైక్ ర్యాలీ ఉంటుందని, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఎన్నిక అనంతరం తొలిసారిగా రాష్ట్ర కార్యదర్శి హోదాలో జిల్లాకు వస్తున్న సందర్భంగా సిపిఐ సమితి ఆధ్వర్యంలో నాయకులగూడెం వద్ద ఉన్న తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణరెడ్డి స్తూపం నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం కొత్తగూడెం క్లబ్బులో అభినందన సభ జరుగుతుందని, పార్టీ ప్రజా సంఘాలు కార్యకర్తలు కూనంనేని అభిమానులు, సానుభూతిపరులు, వివిధ వర్గాల ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ,జి శ్రీను, వి భద్రయ్య, ఐ శ్రీరాములు ,బి వీరభద్రం, బి వీరన్న ,టి లక్ష్మణ్, టి మధు, వి సతీష్ ,ఈ రవీందర్, కె సుందర్ పాల్ తదితరులు పాల్గొన్నారు.