కూరగాయల మార్కెట్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని బోయినపల్లి కూరగాయల మార్కెట్లో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో మార్కెట్‌లోని 7 గుడారాలు పూర్తిగా దహనమయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిందా ? ఎవరైనా కావాలని చేశారా అని వ్యాపారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.