*కూలిన ఇల్లు.. తప్పిన ప్రమాదం*
శ్రీరంగాపురం, జులై . ( జనం సాక్షి) :
గత అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వెంకటాపురం గ్రామంలోని ఓ ఇల్లు కూలింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిత తెలిపిన వివరాల ప్రకారం.. అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామానికి చెందిన కృష్ణయ్య ఇల్లు బుధవారం కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. గ్రామస్థుల సమాచారం మేరకు గురువారం వీఆర్‌వో వెంకటయ్యతో కలిసి పంచాయతీ కార్యదర్శి హరిత గ్రామంలో పర్యటించారు. వివరాలు సేకరించారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అదజేస్తామని చెప్పారు. ఇల్లు కూలిపోవడంతో తనను ఎలాగైనా ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు.