Wednesday, 4 November 2026

ఎమ్ ఎమ్ ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

చండ్రుగొండ జనంసాక్షి (జూలై ) : ముస్లిం మైనార్టీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో  మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలో  గురువారం నూతన కమిటీ ఎన్నిక జరిగిందని  ఎమ్ ఎమ్ ఎస్   జిల్లా అధ్యక్షుడు బాద్ షా అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ముస్లిం మైనారిటీ సంక్షేమ సమితి  వ్యవస్థాపక అధ్యక్షుడు  ఆదేశాల మేరకు  కమిటీ వేయడం జరిగిందన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా  ఎస్ డి. అల్లాభక్షు,ఉపాధ్యక్షుడిగా  బాజి,సెక్రటరీగా  జాన్ బాషా, ఖాసీం, వర్కింగ్ ప్రెసిడెంట్  అక్బర్,కోశాధికారిగా జాన్ వలీ ని  ఎన్నుకున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్ ఎమ్ ఎస్   బాధ్యులు పాల్గొన్నారు.