కూలిన వంతెన… జర పైలం..! బోథ్ (జనంసాక్షి) మండల కేంద్రానుండి మర్లపల్లి వైపు మార్గంలో ఉన్న కండ్రవాగు పై ఉన్న వంతెన ఒక వైపు నుండి కూలుతోంది. ఇప్పటికే ఈ వైపు రోడ్డు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి. అంతవరకు పాత వంతెన పైనే రాకపోకలు సిగుతున్నాయి. వంతెన కూలిన విషయం తెలియక పాఠశాల బస్సులతో పాటు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాకపోకలు భద్రంగా సాగించండి
కూలిన వంతెన… జర పైలం..!




