Thursday, 5 November 2026

కూలిన విమానం, హ్యారిసన్ సేఫ్

హాలీవుడ్ హీరో హారిసన్‌ స్వల్ప విమాన ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెండు సీట్లున్న చిన్న విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లిన ఆయన స్థానిక పోర్టులో ల్యాండ్ చేస్తున్న సమయంలో గోల్ఫ్ కోర్టులో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో హ్యారిసన్‌ తలకు బలమైన గాయమైంది. ఇండియానా జోన్స్ సినిమాతో హ్యారిసన్ అందరికీ సుపరిచితుడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీసు అధికారులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *