Thursday, 5 November 2026

టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పండి

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పిలుపునిచ్చారు. సమాజాన్ని నడిపించే పట్టభద్రులు సరైన తీర్పు ఇచ్చి రాష్ర్ట అభివృద్ధికి అడ్డుపడుతున్న బీజేపీ, టీడీపీలకు బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉనికి కోసమే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నరని కర్నె ప్రభాకర్ విమర్శించారు. పొన్నం ప్రభాకర్ కు నీతి నియమాలు ఉంటే మంత్రి జగదీశ్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రజారంజక పాలనకు పట్టభద్రులు ఓట్లేసి ఆమోదం తెలపాలని కర్నె ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *