హస్తినాపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఆందోజు సత్యం చారి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని హస్తినాపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఆందోజు సత్యం చారి ఓటర్లను అభ్యర్థించారు . మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ .17 .18 వార్డ్ ఇంచార్జి గా ఉన్న మన ప్రియతమ నాయకులు శాసన సభ్యులు చైర్మన్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి తోడుగా ఉంటూ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా హస్తినాపురం డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆందోజు సత్యం చారి ఆధ్వర్యంలో ,డివిజన్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి , హస్తినాపురం డివిజన్ టీఆర్ఎస్ బిసి సెల్ ప్రధాన కార్యదర్శి భిక్షపతి చారి ,టీఆర్ఎస్ డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు విజయ్ కుమార్ , శ్రీరాములు గౌడ్ ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటి ఇంటి కి తిరుగుతూ కారు గుర్తు పై ఓట్ వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు




