సమసమాజ స్థాపనే లక్ష్యంగా వాల్మీకి రామాయణము*
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ లో టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి*
*గోపాల్ పేట్ జనం సాక్షి అక్టోబర్ (9):*
గోపాలపేట మండలంలోని బుద్దారం గ్రామములో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రావులచంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మొదట వాల్మీకి విగ్రహం ప్రతిష్టించే స్థలంలో వేదపండితులు సూచించినట్లు అంత్రం ఉంచి విగ్రహ ప్రతిష్ట ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని పూజలు నిర్వహించారు అనంతరం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ ప్రాంగణములో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు సమర్పించి పూజలు నిర్వహించి మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చారు. ఈకార్యక్రమంలోబి.రాములు,అచుతారా మారావు, వెంకటయ్య యాదవ్ ,నందిమల్లఅశోక్,జోగు శాంతన్న ,రాజు,వాల్మీకి సోదరులు,గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.