Monday, 2 November 2026

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం సబితా

నాంపల్లి అక్టోబర్ 11( జనం సాక్షి )మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండలం లోని పసునూరు, చల్లవాణి కుంట, నామనాయక్ తండ గ్రామాలలో సబితా ఇంద్రారెడ్డి మునుగోడు ఉపఎన్నికల భాగంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ గతంలో ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టాలని, 2018 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన కూడా ప్రతి గ్రామాలలో ను, ప్రతి మండలాల్లో మునుగోడు ప్రజలందరికి అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పుడు వచ్చిన ఉపఎన్నికలు వ్యక్తి స్వార్థం కోసం వచ్చాయని, వ్యవస్థలో మార్పు రావాలంటే రాజీనామాలు చేయడమే కాదని, వ్యక్తిగత స్వార్థం కోసం వచ్చాయాని యాదేటుగా తెలిపారు. మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని స్పష్టత తెలిపారు. దేశంలో బిజెపి పార్టీ ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. దేశంలో పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచడం, ప్రతి వస్తువు పై జీఎస్టీ వేసి పేదల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి పనులతో, సంక్షేమ పథకాలు, రైతులకు 24 గంటల కరెంటు, రైతు బీమా,రైతు బంధు, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్ల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ల లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల వ్యవసాయ బావుల కాడా మోటార్లకు మీటర్లు పెడతారనిన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరు ప్రభాకర్ రెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి,జెడ్పిటిసి వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ నుండి టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అర్కల కామేష్ రెడ్డి కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, సర్పంచ్ పోగుల వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఎస్ కె అబ్బాస్, ఇంద్రావత్ రవి నాయక్, ఉయ్యాల నవీన్ గౌడ్, తీగల సాయినాథ్ రెడ్డి, జటావత్ రవినాయక్, దండిగా నరసింహ,మాజీ ఎంపిటిసి ఎరుకల రవి గౌడ్, రమావత్ మోహన్ నాయక్, దండు సాలయ్య తదితరులు పాల్గొన్నారు.