Tuesday, 3 November 2026

కెటిఆర్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌

మూడు మొక్కలు నాటిన కేథరిన్‌ హడ్డా

హైదరాబాద్‌,జూలై27(జ‌నం సాక్షి ): హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా స్వీకరించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో కేథరిన్‌ హడ్డా మూడు మొక్కలు నాటారు. ఇక కేథరిన్‌ హడ్డా.. మరో ముగ్గురు ప్రముఖులకు హరిత సవాల్‌ విసిరారు. నటుడు మోహన్‌బాబు, టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా విూర్జా, బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ప్లెమింగ్‌తో పాటు టీ హబ్‌కు కేథరిన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ చేశారు. ఒక్కొక్కరు మూడు మొక్కల చొప్పున నాటాలని ఆమె సూచించారు.