భీమిలి బాలికలకు అస్వస్థత
విశాఖపట్టణం,జూలై27(జనం సాక్షి ): భీమిలి ఏపీ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్‌లో… కలుషిత ఆహారం తిని 150మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ప్రిన్సిపల్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి… విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మంత్రి గంటా శ్రీనివాస్‌కు సమాచారమిచ్చారు. దీంతో మంత్రి హుటాహుటిన భీమిలికి బయల్దేరివెళ్లారు.
—