కెనరా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు మినీ కిచెన్ సెట్స్ పంపిణి

ఏటూరు నాగారం (జనం సాక్షి) ఆగష్టు 08.

ఏటూరునాగారం మండలం కొండాయి, మల్యాల గ్రామాల వరద బాధితులకు కెనరా బ్యాంకు కి చెందిన యూనియన్ వారు మినీ కిచెన్ సెట్స్ పంపిణీ చేశారు. ఏటూరునాగారంలో వివేకానంద స్కూల్ వద్ద వారు కిచెన్ సామాగ్రిని 100 మంది వరద భాదితులకు కెనరా బ్యాంక్ ఎంప్లాయిస్ రాష్ట్ర యూనియన్ కార్యదర్శి. మధుసూదన్ కెనరా బ్యాంక్ ఏజిఎం మాధవి ఏటూరునాగారం వివేకానంద కరస్పండెంట్ పెండ్యాల ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమం లో కెనరా బ్యాంకు యూనియన్ ఎంప్లాయిస్ కార్యదర్శి మధుసుధన్ ఎ జి ఎమ్ మాధవి ఏటూరు నాగారం కెనరా బ్యాంకు మేనేజర్ భూక్య వీరు శశిధర్ సాయి ప్రసాద్ వినయ్ కుమార్ రఘు, జలీల్ తులసి రామ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు