కెమికల్ ఇంజనీర్ విద్యార్థులకు ఎన్నో అవకాశాలు
బీవీఆర్ ఐటీ ఫ్రోఫెసర్ డాక్టర్ రాధిక
నర్సాపూర్. సెప్టెంబర్, 16, ( జనం సాక్షి ) :
కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎన్నో ఉద్యోగ , ఉపాధి అవకాశాలు ఉన్నాయని బీవీఆర్ ఐటీ ఫ్రోఫెసర్ డాక్టర్ రాధిక అన్నారు. శుక్రవారం నాడు కళాశాలలో మాట్లాడుతూ కెమికల్ ఇంజనీరింగ్ లో ఉన్నత చదువులు చదవడానికి అమెరికాకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా వృద్ధి చెందుతుందని తెలిపారు. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశమని , కెమికల్ ఇంజనీరింగ్ కి భారతదేశంలో, అమెరికాలో, అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని చెప్పారు. బి.వి.ఆర్.ఐ.టి కెమికల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు మొదటి సంవత్సరం నుంచి విద్యార్థులకు వివిధ రంగాల్లో పరిశోధన మీద ఆసక్తి కల్పించి వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారని దాంతో విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ఉద్యోగము లేదా ఉన్నత చదువుల కోసం భారతదేశంలో, వివిధ దేశాలకు వెళుతున్నారని తెలిపారు. గడిచిన మూడు సంవత్సరాలలో తమ కళాశాల నుంచి 30 మంది పైగా విద్యార్థులు అమెరికా, వివిధ దేశాలు ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లారని అన్నారు. సమావేశంలో కళాశాల ఏవోలు బాపిరాజు, అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.