Tuesday, 3 November 2026

కెసిఆర్‌ తెలంగాణ పోరాట యోధుడు

మళ్లీ ఆయనకే పట్టం కట్టాలి
ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూకుడు
ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): కేసీఆర్‌ 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించారని ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి జోగురామన్న అన్నారు. అధికారం కోసం ఆంధ్రా పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అమరవీరులను అవమానించిందన్నారు. నాలుగేండ్లుగా అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని వలస పాలకుల చేతులో పెట్టవద్దన్నారు. దేశాన్ని పాలించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాంటి పార్టీలకు ఓటు వేస్తే రాష్ట్రం వెనుకబడిపోతుందన్నారు. కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను అన్నదాతలందరూ స్వాగతిస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు పేదల ఇంట్లో కల్యాణ కాంతులు నింపుతున్నాయన్నారు. అమ్మఒడి పథకం గర్భిణులు, బా లింతలకు ఒక వరమన్నారు. వేసవిలో నీటి కష్టాలు లేకుండా మిషన్‌ భగీరథ పథకం కింద నల్లాలు బిగిస్తున్నారన్నారు. త్వరలోనే ఇంటింటికి పరిశుభ్రమైన నీరు సరఫరా అవుతుందన్నారు. ఎన్నికల సమయం సవిూపిస్తుండడంతో కారు స్పీడ్‌ దూసుకెళ్తుంది. అలసట లేకుండా ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి జోగురామన్న, బోథ్‌ నియోజకవర్గ అభ్యర్థి రాథోడ్‌ బాపురావుతో పాటు ఎంపీ గోడం నగేశ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ పాటలతో రోడ్‌ షో ¬రెత్తింది. తెలంగాణ పాటలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, మంత్రి జోగు రామన్న అభిమానులు నృత్యాలు చేశారు. ఓపెన్‌టాప్‌ వాహనంపై నుంచి మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌ షోను కొనసాగించారు. ఎంపీ గోడం నగేశ్‌ నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. అక్కడక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పలు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర పార్టీల నాయకులను టీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓట్లు అడుగడానికి వస్తున్న ప్రతిపక్ష పార్టీలను తిప్పికొట్టాలని మంత్రి జోగురామన్న అన్నారు. మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గానికి సేవకుడిగా పని
చేస్తానని బోథ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్‌ బాపురావు అన్నారు.పలు గ్రామాల్లో ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు.  డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి బోథ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలనికోరారు. అభివృద్ధి రాష్ట్రంలో కొనసాగాలంటే మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలన్నారు.
/-రజాకూటమి నాయకులు అధికారం దాహంతో మాయామాటలు చెబుతున్నారని, లేనిపోని మాటలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. ప్రజాకూటమి నేతల మాటలను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. నాలుగేళ్లలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయి. అభివృద్ధి చేసిన పార్టీని ప్రజలు ఆదరిస్తారన్నారు.
——————–