ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం
తాండూరు,డిసెంబర్3(జనంసాక్షి): తాండూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి మహేందర్‌రెడ్డి ప్రచారంలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారం, బైక్ ర్యాలీ లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలతో మహేందర్‌రెడ్డి ప్రచారంలో అందరికంటే ముందున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తూ మద్దతు పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి యువకులను మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ కలుస్తూ టీఆర్‌ఎస్‌కే ఓటేయాలని కోరుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకే మా ఓటు అంటూ జనం బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగేండ్లలో నియోజకవర్గానికి రూ. 1,750 కోట్ల నిధులను నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని మంత్రి అన్నారు. ఆర్‌అండ్‌బీ ప్రధాన రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి పనులకు రూ.435 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. పలు వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా, సంబంధిత పనులు కొనసాగుతున్నాయి. తాండూర్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు రూ.100 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు, రూ.52 కోట్లతో వికారాబాద్-తాండూర్ డబుల్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు గ్రామాల్లోని అంతర్గత, జడ్పీ రహదారుల నిర్మాణానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.150 కోట్లను మంజూరు చేసింది. మిషన్ భగీరథ దాదాపు పూర్తితాండూర్ నియోజకవర్గంలో రూ.70 కోట్లతో 1200 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, రూ.36 కోట్లతో రెండు మైనార్టీ బాలుర, బాలికల గురుకుల పాఠశాల భవనాలు, రూ. 10 కోట్లతో మైనార్టీ గురుకుల పాఠశాల వసతిగృహం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాండూ ర్‌లో రూ.100 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు, రూ.10 కోట్లతో ఆధునాతన లారీ పార్కింగ్, నాలుగు మండలాల్లో 40 చర్చిల మరమ్మతులకుగాను
రూ.3.5 కోట్లు, ఆలయాలు, దర్గాల మరమ్మతుల నిమిత్తం రూ.5 కోట్ల నిధులను విడుదల చేశారు. అదే విధంగా రూ.650 కోట్లతో నియోజకవర్గంలోని తాండూర్, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందించే పనులు దాదాపు పూర్తయ్యాయి. మెజార్టీ గ్రామాలకు ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాకుండా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పేద, నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.8 కోట్ల ఆర్థిక సహాయాన్ని నాలుగేండ్లలో అందించారు. మిషన్ కాకతీయలో భాగంగా రూ.80 కోట్లతో నియోజకవర్గంలోని 210 చెరువుల మరమ్మతులు పూర్తి చేశామని మంత్రి వివిరించారు.
దూసుకు పోతున్న మంత్రి మహేందర్ రెడ్డి




