దోమ మండల బిజెపి అద్యక్షుడు శేరి రాంరెడ్డి.
దోమ జనం సాక్షి.
కల్వకుంట కవిత ఇంటిముట్టడి కార్యక్రమంలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యక్రర్తలను పోలీసులు దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన సందర్బంగా బండి సంజయ్ చేపట్టే ధర్మ దీక్షలో కూర్చొనియకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసిన తరుణంలో దోమ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాదిగ కార్యక్రమానికి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బొంగు మల్లేష్,కార్యదర్శి రాజు, కిసాన్ మోర్చా కార్యదర్శులు నర్సింహా,శ్రీశైలం, బిజెవైయం మండల ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, బిజెవైయం సోషల్ మీడియా కన్వీనర్ నితిన్ సాగర్, రవికుమార్,బాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




