ఆదివారం ఎల్‌బీ స్టేడియంలో స్వామీజీ షష్టిస్ఫూర్తి సభ జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ ఆచరణ ద్వారా సంస్కారాన్ని అందరికీ తెలియజేసే మహనీయుడని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు. 22 ఏండ్ల క్రితం స్వామీజీతో కలిసి ఒకేవాహనంలో వారం రోజులపాటు పర్యటించే అవకాశం లభించిందని, అది తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తన గురువు గోపాలచార్యులకు పాదాభివందనం చేసిన తర్వాతనే స్వామీజీ యాత్రను ప్రారంభించేవారని కేసీఆర్ గుర్తుచేశారు. గురువులను పూజించిన తర్వాతనే మిగతా పనులు చేయాలనే సంస్కారాన్ని సమాజానికి త్రిదండి నేర్పారని సీఎం చెప్పారు. ఇలాంటి ముఖ్యమంత్రి తమకు గర్వకారణం. భగవంతుడి కోసం శ్రమించేవాళ్లకు భగవంతుడే రక్షకుడిగా ఉంటారు అని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ పేర్కొన్నారు.
కెసిఆర్ తమకు గర్వకారణం: చినజీయర్ స్వామీజీ




