Tuesday, 3 November 2026

*కెసిఆర్ తెలంగాణ ద్రోహి,

టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడంలో తన నైజం తేటతెల్లమైంది..* మేకల సారంగపాణి
———————————- తెలంగాణను సాధించడంలో 1400 మంది బలిదానం చేస్తే అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ తెలంగాణ పదాన్ని విస్మరించి భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మార్చడం తన నియంత పోకడలకు నిదర్శనమని మరో నైజాంను తలపిస్తున్నాడని మహంకాళి సికంద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చి తెలంగాణ సాధన సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్ అని, తాను తన కుటుంబ సభ్యులు రాష్ట్ర దనాన్ని దోచుకున్నారని సారంగపాణి అన్నారు. ఒకప్పుడు ఏమీ లేని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు వేల కోట్లకు పడగలెత్తారని త్వరలోనే వీళ్ళ బతుకు బండారం బయటపెడతామని, నిధులు,నీళ్లునియామకాల పేరుతో తెలంగాణ సెంటిమెంటు తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్కటి సాధించలేదని ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తరిమి కొట్టడానికి కెసిఆర్ ను బీఆర్ఎస్ ను బొంద పెడతారని మేకల సారంగ పాణి అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారులు పట్టించడానికి, మరియు తన అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం బిఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రోజురోజుకు తెలంగాణలో బలపడి అధికారంలోకి రావడం ఖాయం అని, మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలుపుఇప్పటికే ఖాయం అయిందని నవంబర్ ఆరు తర్వాత టిఆర్ఎస్,బి ఆర్ స్ దుకాణo మూయవల్సిందేనని కుటుంబం మొత్తం జైలు పాలుడు కావడం ఖాయమని మేకల సారంగపాణి తెలిపారు.