Tuesday, 3 November 2026

కెసిఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి

నియోజకవర్గ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, సిసి రోడ్లు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు జులై 7 (జనం సాక్షి)
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
గురువారం పటాన్చెరు మండల పరిధిలోని బచ్చు గూడెం, పోచారం, పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, రామేశ్వరం బండ తదితర గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, సిసి రోడ్లు, బృహత్ పల్లె ప్రకృతి వణం, వీధి దీపాలను ప్రారంభించారు. బచ్చు గూడెం గ్రామంలో దళిత బంధు లబ్ధిదారుని వ్యాపార సముదాయాన్ని ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన
మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్సార్ నిధులను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాల కతీతంగా పూర్తి పారదర్శకత్వంతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో  ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, దళిత బందు ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీడీవో బన్సీలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరత రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.