కెసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ బి ఆర్ ఎస్ లో పార్టీలో చేరిక

కెసిఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ బి ఆర్ ఎస్ లో పార్టీలో చేరిక

భైంసా రూరల్ నవంబర్ 07 జనం సాక్షి

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం రాహుల్ నగర్ లోని కిరణ్ కొమ్రేవార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి తన అధ్యక్ష పదవితో పాటు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన మాదిరిగానే నేడు కిరణ్ కొమ్రేవార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం జరుగుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం లాగా బీఆర్ఎస్ చిల్లర పార్టీ కాదని ఒక ఉద్యమ పార్టీ అని అన్నారు. రమాదేవిని మోసం చేసిన బీజేపీ, కొమ్రేవార్ ను మోసం చేసిన కాంగ్రెస్ బుద్దిచెప్పే విధంగా బీఆర్ఎస్ ముధోల్ అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.