Tuesday, 3 November 2026

కేంద్రం సహకారంతో నాలుగేళ్లలో పోలవరం పూర్తి: చంద్రబాబు

హైదరాబాద్‌: కేంద్రం సహకారంతో నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగించామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలకు అన్యాయం జరగనివ్వమని, సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే మళ్లిస్తామన్నారు. ఉభయగోదావరి, అనంతపురం జిల్లాల ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించారని ఆయన పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో కమిషన్లు, ముడుపులకోసం కాలువలు తవ్వారని ఆయన ఆరోపించారు. పోలవరంపై అశ్రద్ధ లేదని కేంద్రం చెప్పిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తనదని, అది తన కల అని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేసుకుంటే కరువు పరిస్థితులు ఉండవన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడానికి ‘నీరు-చెట్టు’ కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *