– ఎమ్మెల్సీ రామచంద్రరావు
హైదరాబాద్, సెప్టెంబర్9 (జనం సాక్షి ) : కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఇది సరియైన పద్దతి కాదని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు అన్నారు. కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో పూర్తిస్థాయి బ్జడెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు బ్జడెట్‌లో కేటాయించిన మొత్తాన్ని తన ప్రసంగం ద్వారా వినిపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్జడెట్‌పై బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పందించారు. బ్జడెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ బ్జడెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందన్నారు. ఓటాన్ అకౌంట్ బ్జడెట్ కంటే ప్రస్తుత బ్జడెట్ రూ. 32 వేల కోట్ల బ్జడెట్ తగ్గిందన్నారు. ఈ బ్జడెట్‌పై పూర్తి చర్చ జరగాలన్నారు. బ్జడెట్ ద్వారా టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిందని రామచంద్రరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విూద నిందలు వేయటానికి చేసిన ప్రయత్నం చేసింది తప్ప కొత్తగా ఏం లేదని విమర్శించారు. కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం తప్పుగా చూపే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదనీ.. రాష్ట్ర ఖజానా లోటులో ఉందని చెప్పటానికి సీఎం కేసీఆర్ తప్పుడు వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్ర పథకాలను అమలు చేయబోమని ఈ బ్జడెట్ ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసిందని రామచంద్రరావు విమర్శించారు.
కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం సరికాదు




