Monday, 2 November 2026

ప్రభుత్వ వైఫల్యాలకు కేసీఆర్‌ బ్జడెట్‌ నిదర్శనం

– కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలకు సీఎం కేసీఆర్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బ్జడెట్‌ నిదర్శనమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీపై బ్జడెట్‌లో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. రుణాలు మాఫీకాక, రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వక, ఇచ్చిన రుణాలకు వడ్డీ వసూళ్లు చేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒక్కసారి రుణమాఫీ చేస్తారా..? విడతల వారీగా చేస్తారా..? అనేది చెప్పకపోవటం బాధాకరమన్నారు. ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై బ్జడెట్‌లో ప్రస్తావించ లేదన్నారు. ఆరోగ్యశ్రీ అమలుచేస్తూ ఆయుష్మాన్‌ నిధులను తీసుకోవాలని జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కవిూషన్‌ల బాగోతం బయటపడుతుందని కేసీఆర్‌ కాళేశ్వరానికి జాతీయ ¬దా అడగటం లేదని విమర్శిచంఆరు. కేవలం తన వైఫల్యాలను కేంద్రంపైకి నెట్టి ప్రజల్లో సానుభూతిని పొందాలని కేసీఆర్‌ చూస్తున్నారని  జీవన్‌రెడ్డి విమర్శించారు.
బ్జడెట్‌లో సంక్షేమానికి పెద్దపీట – ఎమ్మెల్సీ కర్నె
తెలంగాణ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం కేసీఆర్‌ బ్జడెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ కొనియాడారు. ఆర్థిక మాంద్యం ఉన్నా పథకాలకు కేటాయింపులు తగ్గించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు బాగున్నాయని,
వ్యవసాయరంగానికి కేటాయింపుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసిందని కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు.