హైదరాబాద్,సెప్టెంబర్9
టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన బ్జడెట్ వాస్తవానికి దూరంగా ఉందని, అవగాహన లోపం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ బ్జడెట్‌లో ఏవిూ లేదని, ప్రభుత్వం చేతులెత్తేసిన బ్జడెట్‌లా ఉందని విమర్శించారు. ఆరు నెలల కోసం అవసరం లేకపోయినా ఓట్ ఆన్ అకౌంట్ బ్జడెట్ ప్రవేశపెట్టారని, ఆ తర్వాత ఆరు నెలల బ్జడెట్ ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ మిగులు బ్జడెట్ ఫలాలు ఐదేళ్ల వరకూ సాగాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వ వాస్తవ ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. అందుకే కోతలు పెడుతున్నారని, బ్జడెట్‌లో నిరుద్యోగ భృతి, మూడెకరాల ఊసూ లేదని, డబుల్ బెడ్రూం, ఊసు అసలే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపాద, ఎల్లంపల్లితో హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ అని, కానీ కేసీఆర్ గొప్పతనంగా చెప్పుకుంటున్నారని మల్లు మండిపడ్డారు. కాళేశ్వరం ప్యాకేజీలు కాంగ్రెస్ నిర్మిస్తే, జలకళ అని టీఆర్‌ఎస్ ప్రచారం చేసుకుంటోందని భట్టివిక్రమార్క ఆరోపించారు.




