Tuesday, 3 November 2026

కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తంచేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

డబల్ ఇన్ కం ఆదాని, అంబానీలకు

కేంద్రం తీరు నవ్వి పోదురు గాక మాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది

2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు

దేశంలో ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేయడం ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేశారు

ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం పంటల మద్దతు ధరలు అమలు చేస్తామని చెప్పి సీ + 50 బదులు ఎ + 50 అమలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు

దేశంలో పండే 53 పంటలకు గాను కేవలం 29 పంటలకే ఎంఎస్ పీ ప్రకటిస్తున్నారు

అందులో ప్రధానంగా నాలుగైదు పంటలనే మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నారు .. అది కూడా పండిన పంటలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు

ఇక్కడ ఉన్న పంటలను కొనుగోలు చేయకపోగా అవే పంటలు దిగుమతి చేసుకుంటుండడం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిదర్శనం

ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని తుంగలో తొక్కారు

రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు
కేంద్రానికి వ్యవసాయ రంగం పట్ల ఒక సమగ్ర విధానం గానీ, ప్రణాళిక గానీ శూన్యం

నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతుల ఆందోళనలకు కారణమయ్యారు

16 నెలలు రైతులు ఢిల్లీని చుట్టుముట్టి ఆందోళనలు చేసి 700 మంది రైతులు అమరులయ్యాక జాతికి క్షమాపణలు చెప్పి చట్టాలు ఉపసంహరించుకున్నారు

చట్టాలు ఉపసంహరించుకున్నప్పుడు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించారు

రైతులను మోసం చేయడం, మభ్యపెట్టడం తప్ప వారికి మేలు చేయాలన్న ఆలోచన ఏ కోశానా కనిపించడం లేదు

పంట ఉత్పత్తులు పెంచుతున్న రాష్ట్రాలకు కనీస ప్రోత్సాహం కేంద్రప్రభుత్వం నుండి లేదు

స్వయం సామర్ధ్యంతో అధిక ఉత్పత్తి సాధించిన తెలంగాణ రైతుల వరిధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నది…పైగా వరి సాగు పెంచాలని రాష్ట్రాలను కోరుతున్నది

అసలు కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం, కొనుగోళ్ల విధానాలపై స్పష్టమయిన విధానం లేదు

రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి