Tuesday, 3 November 2026

కేంద్ర ప్రభుత్వ  బడ్జెట్ పేదలను మరచి _పెద్దలను వరించిన బడ్జెట్ :  మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్  రెడ్డి  

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )   కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమాన్ని మర్చిపోయిందని మాజీ కార్పోరేటర్ జీవీ సాగర్ రెడ్డి అన్నారు   . శుక్రవారం నాడు   కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ చౌరస్తాలో తెరసవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి జహీరఖాన్, జిల్లా అధ్యక్షులు గుండుమల్ల  పాండుగౌడ్, ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు నిరసనగా బడ్జెట్ పత్రాలను దహనం చేసి  నిరసన వ్యక్తం చేశారు అనంతరం  ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిలుగా హాజరైన కొత్తపేట మాజి కార్పొరేటర్ జీవి సాగర్ రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రామ్ నర్సింహ గౌడ్   వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమాన్ని మర్చిపోయింది కొన్ని వర్గాలకు మాత్రమే మేలు చేకూరే విధంగా వుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి పై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని మండిపడ్డారు. ఉద్యోగ రంగంలో అనేక ఖాళీలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం పై రాష్ట్ర బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం చాలా విడ్డూరమన్నారు. అనేక సంవత్సరాలుగా ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కావాలన్న డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతూ నేటికి కూడా హామీని అమలు పరచక పోవడం చాలా బాధాకరం ఇవాళ బిజెపి ఎంపీలు జాతీయస్థాయిలో పోరాటం చేసి తెలంగాణ నిధులు తేవాల్సిన పొగ, తెలంగాణ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయలేదని నిందించడం సిగ్గుమాలిన తనానికి నిదర్శనం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి  ఎయిర్ ఇండియా, ఎల్ఐసి ఇలాంటి సంస్థలు అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకం పోయింది అన్నారు.  దేశం యొక్క అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పెరిగిన సాంకేతిక, మౌలిక సదుపాయాల అనుగుణంగా రావాలి. కానీ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు దీక్షల పేరు మీద తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ ప్రజలు వారి దారిలో వెళ్ళొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నామని చేశారు .. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ కొత్తపేట మాజి అధ్యక్షుడు రాగిరి ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాజు,డివిజన్ యూత్ అధ్యక్షులు జోగి నగేష్, రాకేష్, భాస్కర్, ప్రశాంత్, శ్యాం సీను,లోకేష్,ప్రభు, శివ, సునీల్, పిటే సాయి, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.