చండ్రుగొండ జనంసాక్షి (ఫిబ్రవరి 04): స్థానిక సిపిఎం కార్యాలయంలో కెవిపిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి రాయ్ రాజా మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని తొలగించాలన్న మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదా రాజ్యాంగంలో ఏ అంశాలను మార్చాలి ఎందుకు మార్చాలి అనేది ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు లేనిపక్షంలో వెనుకబడిన వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు వై .లక్ష్మణ్ ఏం. మోహన్ రావు, మండల కమిటీ సభ్యులు టి .పవన్ కళ్యాణ్, టి అశోక్, బి. వీరభద్రం, ఎన్. వీరభద్రం, ఎన్. వినోద్ తదితరులు పాల్గొన్నారు….
భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కెసిఆర్ మాట వెనక్కు తీసుకోవాలి. కెవిపిఎస్




