Thursday, 5 November 2026

కేటిఆర్ సభకు తరలివచ్చిన అషేశజనం

జుక్కల్, మార్చి 15, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పిట్లo మండలకేంద్రంలో ని జూనియర్ కళాశాల ఆవరణలో బుధవారము
ఏర్పాటుచేసిన కేటిఆర్ సభకు అషేషజనం తరలివచ్చారు.జుక్కల్ నియోజకవర్గంలోని దోంగ్లి,మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్ గల్, పిట్లo, నిజాం సాగర్ మండలాల నుండి బి ఆర్ఎస్ కార్యకర్తలు,నాయకులు,ప్రజాప్రతినిధులు,మహిళలు,యువకులు వాహనాలల్లో అధికసంఖ్యలో తరలివచ్చారు.వాహనాలకు గులాబీ జెండాలు తగిలించుకుని వచ్చారు.మద్నూర్ నుండీ నిజాం సాగర్ వరకు జాతీయ రహదారి గులాబీ మయం అయ్యింది.రోడ్డుకు ఇరువైపుల ఫ్లెక్సీలు,గులాబీ జెండాలతో ఆకర్షణీయంగాతయారయ్యింది.సభాస్థలి కార్యకర్తలు నినాదాలతో మారుమ్రోగింది.