కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ జనవరి 1 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 6న జరగబోయే ఐటీ శాఖ మాత్యులు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటన విజయవంతం చేయడం కొరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి హుజూర్ నగర్ బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కే ఎల్ ఎన్ రెడ్డి ( డాక్టర్), అట్లూరి హరిబాబు, మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ గెల్లి రవి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ జక్కుల శంభయ్య, మలిదశ ఉద్యమకారుడు ఎడ్ల విజయ్, బి ఆర్ ఎస్ నాయకులు కడియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం




