Wednesday, 4 November 2026

కేరళకు సాయంగా ఐఎఎస్‌ అధికారుల విరాళం

అధికమొత్తంలో సాయం అందిస్తున్న తెలంగాణ ఉద్యోగులు

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): తమ ఒక్క రోజు వేతనాన్ని కేరళ వరద బాధితులకు సహాయం కోసం కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందించనున్నట్టు తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌, తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి, నగర పోలిస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి రూ.25 వేలు విరాళం ప్రకటించారు. జిల్లాస్థాయి అధికారులు రూ.5వేలు, కిందిస్థాయి ఉద్యోగులు రూ.500లకు తగ్గకుండా విరాళాలను అందజేయాలని కలెక్టర్‌ కోరారు.తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘాలు తమ ఒకరోజు వేతనాన్ని కేరళ వరద బాధితులకు ప్రకటించాయి. ఆగస్టులో ఒకరోజు వేతనం రూ.1.50 కోట్లను కేరళ బాధితులకు అం దించాలని కోరుతూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీకి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్‌, ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డిలతోపాటు డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే కృష్ణారెడ్డి తదితరులు అంగీకారపత్రం అందజేశారు. సెర్ప్‌ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా తమ ఒకరోజు వేతనం రూ.10 లక్షలను కేరళ వరద బాధితులకు సహాయంగా ఇవ్వాలని సెర్ప్‌ సీఈవో పౌసమిబసుకు సోమవారం అంగీకార పత్రం అందించారు. కేరళ ప్రజలను ఆదుకోవడానికి అన్ని వర్గాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ గెజిటెడ్‌ అధికారులు తమ ఒకరోజు వేతనం మొత్తం రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. రూ.10 కోట్ల చెక్కును తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో సం ఘం అధ్యక్షురాలు మమత, ప్రతినిధులు సత్యనారాయణ, ఎంబీ కృష్ణయాదవ్‌, జీ వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌ గుప్త తదితరులు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి అందజేశారు.తెలంగాణ హజ్‌ కమిటీచైర్మన్‌ మహ్మద్‌ మసీఉల్లాఖాన్‌ నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. లంగర్‌హౌస్‌లోని మధు పార్క్‌రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌వాసులు రూ.25 వేల ఆర్థికసాయాన్ని కేరళ సీఎం రిలీ ఫ్‌ ఫండ్‌కు అందించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉద్యోగులు ఒక రోజు వేతన మొత్తం రూ.1,13,480లను కార్పొరేషన్‌ చైర్మన్‌ మందుల సామేల్‌ ద్వారా కేరళ సీఎం సహాయ నిధికి ఆన్‌లైన్‌లో పంపారు. సీఐటీయూ నాయకురాలు ఎం పద్మ, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ నేత కే పార్‌థ్ధసారథి కేరళ ప్రభుత్వానికి రూ.50 వేలు అందజేశారు. తెలంగాణ జన విజ్ఞాన వేదిక సైతం మరో 50 వేల రూపాయల చెక్కును అందజేసింది. తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని సోమవారం నిర్ణయించారు. ఈ మొత్తాన్ని జీతంలోంచి రికవరీకి వీలుగా చేసిన తీర్మానాన్ని మంగళవారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావును కలిసి ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలోఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (1104) ప్రతినిధులు పద్మారెడ్డి, సాయిబాబా, స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ -327 నుంచి శ్రీధర్‌, పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నుంచి రత్నాకర్‌రావు, సదానందం, పవర్‌ డిఎ/-లొమా ఇం జినీర్స్‌ అసోసియేషన్‌ నుంచి బీసీ రెడ్డి, తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం (బీ-1245) నుంచి ఎండీ అబ్దుల్‌ అజీజ్‌, పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌-1535 నుంచి ఎంఏ వజీర్‌, ఎలక్టిస్రిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నుంచి రాజేందప్రసాద్‌, సుకుమార్‌, విద్యుత్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ నుంచి నెహ్రూ, భాస్కర్‌, ఎలక్టిస్రిటీ అకౌంట్స్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ నుంచి ఎం కరుణాకర్‌రెడ్డి, బీ ఈశ్వర్‌గౌడ్‌, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నుంచి కిరణ్‌, ఎలక్టిస్రిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుంచి శ్యాంకుమార్‌, రమేశ్‌, ఎలక్టిస్రిటీ బీసీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుంచి కుమారస్వామి, వెంకన్నగౌడ్‌, ఎలక్టిస్రిటీ ఓసీ ఎంఎ/-లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుంచి సీ భానుప్రకాశ్‌, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుంచి ఎం రాంజీ, ఎలక్టిస్రిటీ ఎంఎ/-లాయీస్‌ ముస్లిం మైనార్టీ అసోసియేషన్‌ నుంచి ఎండీ అక్బర్‌, ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ, దళిత్‌ క్రిస్టియన్‌ ఎంఎ/-లాయీస్‌ అసోసియేషన్‌ నుంచి డీ చంద్రశేఖర్‌, ఎలక్ట్రిసిటీ వుమెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నుంచి ఎం తులసీనాగరాణి, ఎలక్ట్రిసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (హెచ్‌-64) నుంచి మురళి, సుధాకర్‌, ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నుంచి సత్యనారాయణ, టీఎస్‌ జెన్‌కో కెమిస్ట్‌ అసోసియేషన్‌ నుంచి గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. జలమండలి ఇంజినీర్ల విరాళం రూ.12 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి జలమండలి ఇంజినీర్లు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించినట్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంబీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. సంస్థలో మేనేజర్‌స్థాయి నుంచి డైరెక్టర్‌వరకు విధులు నిర్వహిస్తున్న 350 మంది ఇంజినీర్లు తమ ఒకరోజు వేతనం దాదాపు రూ.12లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్టు చెప్పారు.