కేశపురం గ్రామంలో మాల మహానాడు గ్రామ కమిటీ ఎన్నిక
బచ్చన్నపేట అక్టోబర్ 16 (జనం సాక్షి) జనగామ జిల్లా . బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశపురం గ్రామంలో తెలంగాణ మాల మహానాడు గ్రామ కమిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల బాల నర్సయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా తాడెం నరేందర్. ఉపాధ్యక్షునిగా కాగితం గణేష్. కోశాధికారిగా కాగితం కిషన్. ప్రధాన కార్యదర్శిగా చిలువేరు గణేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాలలు అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. నా మీద నమ్మకంతో ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్న మాలలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసంపనిచేస్తానని గ్రామ శాఖ అధ్యక్షులు తాడెం నరేందర్ మాలలకు కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు