కేసముద్రం మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం

చైర్మన్ మర్రి నారాయణరావు కు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ హామీ
కేసముద్రం జూలై 21 జనం సాక్షి/ గురువారం హైదరాబాదులో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి మరియు అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు ను కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి మార్కెట్ అభివృద్ధి పనులు మరియు పలు విషయాలపై చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ….కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో అసంపూర్తిగా ఉన్న మార్కెట్ కార్యాలయ భవన నిర్మాణ పనులతో పాటు మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఉన్న సివిల్ సప్లై గోదాముల మరమ్మతుకు,నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు,మార్కెట్ యార్డు ప్రహరీ గోడ పెంపుదల అలాగే మరిపెడ సబ్ యార్డు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కోసం నివేదిక పంపామని,ప్రభుత్వ అనుమతి రాగానే పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా అభివృద్ధి పనుల అంశం పై మార్కెటింగ్ శాఖ అంచనాలు రూపొందించి నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపినట్లు చైర్మన్ తెలిపారు.ప్రభుత్వ అనుమతి రాగానే అభివృద్ధి పనులు చేపట్టడానికి టెండర్లను పిలుస్తామని ఉన్నతాధికారులు చెప్పినట్లు చైర్మన్ తెలిపారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ జాతీయస్థాయిలో ఈనామ్ విధానం పూర్తిస్థాయిలో చేస్తూ ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా ఎక్సలెన్సీ అవార్డు పొందిన నేపథ్యంలో మార్కెట్ సిబ్బందికి నగదు ప్రోత్సాహక బహుమతులను అందించడానికి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ లను ఆహ్వానించినట్లు చైర్మన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి వారు రావడానికి సుముఖత వ్యక్తం చేశారని, త్వరలో సిబ్బందికి నగదు ప్రోత్సాహక బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
Attachments area