హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ అనురాగ్‌శర్మ, సీఐడీ డీజీ సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిసి నివేదిక సమర్పించనున్నారు. దీనిపై కేసీఆర్ సమీక్షించిన తర్వాత ఎంసెట్-2 రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి సీఐడీ నివేదిక సమర్పించింది. ఎంసెట్-2 ప్రశ్నాపత్రం సుమారు 100 మంది విద్యార్థులకు లీకైనట్లు సీఐడీ నిర్ధారించింది.