భార్యను రేప్ చేయమని బావకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన భర్త !

636053910429624806పల్ఘర్: బంధాలుఅనుబంధాలు మంటగలిసిపోయాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పెళ్లయి పట్టుమని నెలకూడా కాలేదు. భార్యను ఓ నీచుడు తన బావకు బహుమతిగా ఇచ్చాడు. జూలై 7న పల్ఘర్ జిల్లాలోని బొయ్సర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 22 ఏళ్ల యువతితో వివాహమైంది. భార్యతో కలిసి ఉంటున్న అతనికి ఇంటికి అక్కాబావ వచ్చారు.
భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై అతని బావ అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ప్రతిఘటించి అతనిని హెచ్చరించింది. తీరా భర్త ఇంటికొచ్చాక జరిగిన విషయాన్ని చెప్పింది. బావకు బుద్ధి చెప్పాల్సిన ఆమె భర్త అత్యంత నీచానికి దిగజారాడు. బావను పిలిచి తన భార్యతో గడపమని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో అవకాశం కోసం ఎదురుచూసిన ఆ మృగాడు ఆమె జీవితాన్ని చిదిమేశాడు. బాధను దిగమింగుకున్న ఆ వివాహిత మౌల్వి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జరిగిందంతా పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.