Tuesday, 3 November 2026

కేసీఆర్‌ ఆవేదన సభగా ‘ప్రగతి నివేదన’

– కనీసం 5లక్షల మంది కూడా సభకు రాలేదు
– ప్రజలను మరోసారి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్‌ యత్నం
– వచ్చే ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం తప్పదు
– తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ విమర్శ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టే మాటలు చెప్పారని తెలుగుదేశం పార్టీ ఆక్షేపించింది. 25 లక్షల ప్రజలు వస్తారని సీఎం ప్రకటిస్తే.. కనీసం 5 లక్షల మంది కూడా హాజరుకాలేదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఇచ్చిన హావిూలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్న విషయం ఆదివారం ప్రసంగంతో అర్థమైపోయిందని విమర్శించారు. దురుద్దేశంతో మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపించిందన్నారు. తాము అనేక ప్రశ్నలు అడిగితే ఒక్కదానికీ స్పష్టమైన సమాధానం రాలేదన్నారు.కేసీఆర్‌ పాలన కొంతమంది వ్యక్తుల అధీనంలోనే నడుస్తోందని రమణ విమర్శించారు. కవిూషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టుల పునరాకృతి పేరిట లక్షల కోట్ల రూపాయల నిధులు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. భూ పంపిణీ, రెండు పడక గదుల ఇళ్లు పూర్తి చేయలేదని, అశాస్త్రీయ జోన్ల విధానం తెచ్చారన్నారు. కేసీఆర్‌ తలపెట్టిన ప్రగతినివేదిక సభ, ప్రగతి వేదన సభగా మారిందన్నారు. కేసీఆర్‌ సభ అవినీతి అక్రమాలకు నిదర్శనమని పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి ఆరోపించారు. నగరంలో ఎక్కడ చూసినా కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఫొటోలు, ప్రకటనలు మాత్రమే కనిపించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అవినీతి, అక్రమాలు, అప్పులు, ఆత్మహత్యలలో మొదటి స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు వల్లే కేసీఆర్‌కి మంత్రి పదవి వచ్చిందన్న విషయం మర్చిపోవద్దని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఇతర పార్టీ నేతలకు భయపడి ఎలాంటి అజెండా లేకుండా ప్రకటనలు చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌ గౌడ్‌ విమర్శించారు.