– రాష్ట్రంలో మహిళలంటే ఒక్క కవితేనా?
– బోనాన్ని ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారు?
– మేం మాట్లాడితే రాజకీయం అంటారు..
– అమ్మవారే ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు
– ఇప్పుడేం సమాధానం చెబుతారు?
– బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ
హైదరాబాద్, జులై31(జనం సాక్షి ) : బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడారు.. జనాభాలో సగం ఉన్న మహిళల ఓట్లతో రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. నేడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని, మహిళలు నరకకూపంలోకి వెళ్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకల్లో మహిళలు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. మేం మాట్లాడితే రాజకీయాలని కొట్టిపారేస్తారని, మరి భవిష్యవాణి చెప్పిన అమ్మవారే ఇలాంటివి చెప్పడం రాష్ట్రం మొత్తం టీవీల్లో చూసిందన్నారు. ‘బంగారు బోనం తెచ్చినా కూడా మహిళల్లో ఆనందం లేదు.. అధికారులు, పోలీసుల దురుసు ప్రవర్తనతో జోగిని శ్యామల కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. ఇది విూ ప్రభుత్వ చేతకాని తనమని, శ్యామల కన్నీళ్లు విూకు కనిపించలేదా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. బంగారు బతుకమ్మతో పాటు బంగారు బోనం సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్‌ఎస్ ఎంపీ కవితది అయిందని, రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా అని ప్రశ్నించారు. ఇంకో మహిళ కూడా కనిపించడం లేదా? నిన్న మహిళా రిపోర్టర్లు, యాంకర్లు అక్కడ ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడటానికి ప్రభుత్వమే కారణమన్నారు. భవిష్యవాణి చెప్పే వారు(స్వర్ణలత), జోగిని శ్యామల ఇలా అందరూ ఇబ్బందులు పడ్డారని, ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆలోచించాలన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు జాతర చేసుకుంటుంటే సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారని, పోలీస్ అధికారి సుమతి దురుసుతనానికి విూరు కారణం కాదా అన్నారు. స్వావిూజీని బహిష్కరించిన తీరు, జోగిని పట్ల విూ తీరుపై విూరు సమాధానం చెప్పాలన్నారు. వచ్చే రోజుల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తున్నామని, సికింద్రాబాద్‌లో బోనాన్ని ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారని ప్రశ్నించారు. కవితకు, సికింద్రాబాద్‌కు ఏమైనా సంబందం ఉందా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ సతీమణి బోనం ఇస్తే మాకు ఏ అభ్యంతరం ఉండేది కాదని, బోనాల నేపథ్యంలో జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆకుల విజయ డిమాండ్ చేశారు.




