Tuesday, 3 November 2026

కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు:రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తన బంధువులకు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు బయటపడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ బంధువులతో కేసులు వేయిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము భయపడేది లేదని, న్యాయస్థానంలో పోరాడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతిని వెలికితీస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పారని రేవంత్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *