రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ముంబయిలో ఉంటున్న మీకు మీ పక్కింట్లో తెలంగాణ మాదిరిగా ఎవరికన్నా ఫించన్లు వస్తున్నాయా ?
తెలంగాణ మాదిరిగా రైతుబంధు పథకం ఉందా ?
తెలంగాణ మాదిరిగా రైతుభీమా ఉందా ?
తెలంగాణ మాదిరిగా కళ్యాణలక్ష్మి, కేసీఅర్ కిట్ అమ్మవడి అందుతున్నాయా ?
ఏది ఇవ్వనోడు ఎగిరెగిరి పడుతున్నాడు
అన్నీ ఇచ్చిన కేసీఆర్ ఇది మన కుటుంబం చక్కగా కుటుంబాలను చూసుకోమని అంటున్నారు
తెలంగాణ రాకతో తండాలలో గిరిజనుల ఆర్థికశక్తి పెరిగింది
రైతుబంధు, రైతుభీమా, సాగునీళ్లు, ఉచిత కరంటు పథకాలతో వ్యవసాయం బలపడింది
అమ్మవడి, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి పథకాలతో గిరిజన బిడ్డలకు అండ
నేను చదువుకున్నప్పుడు నాతో పాటు ఒక్క గిరిజన విద్యార్థి కూడా లేడు
నేడు తండాలలో చదువుకోని విద్యార్థి ఎవరూ లేరు
గత ఎన్నికల సమయంలో వలసొచ్చిన మీరు వెనక్కు వస్తారని హామీ ఇచ్చాను
సాగునీళ్లు వస్తాయి. సంక్షేమ పథకాలు అందుతాయి అని చెప్పాను
పొట్ట చేత పట్టుకుని మీరు వలస వెళ్లవద్దే పరిస్థితి ఉండొద్దని అన్నాను
నాడు నేను చెప్పిన ప్రకారం 70 శాతం హామీ నెరవేరింది
నేడు మిమ్మల్ని కలుసుకోవడం కడుపు నిండినట్లుంది
తండాలలో అన్ని వసతులు కల్పిస్తున్నాం
మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా అధికసంఖ్యలో డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడం జరిగింది
వచ్చే రెండు, మూడేళ్లలో తండాలలో నిరుపేదలను గుర్తించి డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తాం
కరోనా విపత్తు మూలంగా ఆర్థిక సమస్యలతో కొన్ని పథకాలు అలస్యమయ్యాయి
తెలంగాణ ప్రభుత్వం ఆ విపత్తు నుండి త్వరగా కోలుకున్నది
పంద్రాగస్టు తర్వాత కొత్త ఫించన్లు, రేషన్ కార్డులు అందిస్తాం
70 తండాలకు రహదారులు నిర్మించాం .. మరో 20 రహదారుల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తాం
ముంబయి బస్సు ఏర్పాటు చేయిస్తా
వనపర్తి లోని 108 తండాలకు రహదారులు నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత నాది
ముంబయిలో వనపర్తి వాసుల కోసం ఒక భవన నిర్మాణానికి నా సహకారం ఉంటుంది
ఎనిమిదేళ్లలో ఇన్ని పనులు చేస్తే మరి ఇంతకుముందు ఉన్నవాళ్లు 60 ఏళ్లలో ఏం చేశారు ?
ఎనిమిదేళ్లలో సాధ్యమైనన్ని పనుల చేశారు .. శక్తివంచన లేకుండా మరిన్ని పనులు చేయిస్తాం
మహారాష్ట్ర లోని థానే కేపీఆర్ డిగ్రీ కళాశాల, బోరేవళి నలంద అకాడమీలో నిర్వహించిన వనపర్తి నియోజకవర్గ గిరిజన సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన ఎంపీపీ క్రిష్ణ నాయక్, జడ్పీటీసీ సామ్యానాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు జాతృనాయక్, శేఖర్ నాయక్ తదితరులు
తెలంగాణ మట్టి స్పర్శతో పులకించిన ముంబయి
వనపర్తి నియోజకవర్గం నుండి గతంలో గిరిజనులు ముంబయికి వలసవచ్చి నిర్మాణ పనులు చేసుకుని జీవనోపాధి పొందేది
గత ఎన్నికల ముందు ముంబయికి వచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి గిరిజనులతో సమావేశమయ్యారు
ఎన్నికలలో గెలిచిన తర్వాత తిరిగి ముంబయికి వచ్చి అందరినీ కలుస్తానని మాట ఇచ్చారు
గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ముంబయిలో సమావేశాలకు అనుమతి లేదు .. తాజాగా నిబంధనలు సడలించడంతో మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం థానే, గోరై బొరివళిలో వనపర్తి గిరిజన సోదర, సోదరీమణులతో సమావేశం అయ్యారు
ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చిన మంత్రి గారికి గిరిజన ఆడబిడ్డలు ఘన స్వాగతం పలికారు
గిరిజన సాంప్రదాయ పాటలు, నృత్యాలతో హర్షం ప్రకటించారు
తమ తండాలకు రహదారులు వేయించడం, ఎత్తిపోతల పథకం తేవడం, తాగునీటి ఇబ్బందులు తొలగిపోవడం, సాగు నీళ్లు రావడంతో వలసలు తగ్గిపోవడం, తండాలను పంచాయతీలు చేయడం, కరోనా తర్వాత ఎక్కువ మంది ఊళ్లలో స్థిరపడడంపై సంతోషం ప్రకటించారు
మిగిలి ఉన్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు
ముంబయిలో ఉంటున్న పెద్దమందడి మండలం బలిజపల్లి వాసి గోపాల్ బంజారా భాషలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గారిపై పాడిన పాట అందరినీ కదిలించింది. సభికులందరూ పాటకు శృతి కలిపారు
కళ్యాణలక్ష్మి సాయం, కేసీఆర్ కిట్, అమ్మవడి పథకాలు, గర్భవతులకు అంగన్ వాడీ ఆహారం, మిషన్ భగీరథ కుంది ఇంటింటికీ నీళ్లపై మహిళలు సంతోషం ప్రకటించారు
గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు 70 శాతం పూర్తి చేశానని .. మిగిలిన 30 శాతం పూర్తి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు




