Wednesday, 4 November 2026

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ రక్షించలేరు:సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై సాక్ష్యాధారాలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ రక్షించలేరని తెలిపారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని… స్టింగ్ ఆపరేషన్ చేసే హక్కు కేసీఆర్ కు ఎక్కడిదని సోమిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి మొగుడు కాబోతున్నాడని జోస్యం చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేకుండా 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని చెప్పారని ఎద్దేవా చేశారు. ఏపీ లో వైసీపీ కథ ముగిసిందని, అసలైన ఆట ఇప్పుడే మొదలైందని… కేసీఆర్ అంతు చూస్తామని సోమిరెడ్డి పేర్కొన్నారు. సెక్షన్ 8 అమలు చేసే వరకు కేంద్రం పై ఒత్తి తెస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *