*కే ఎల్ ఐ డి 5 మైనర్ కాల్వ పనులను పరిశీలించిన టిఆర్ఎస్ నాయకులు*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (19):* మండల పరిధిలోని సాకల్ పల్లి శివారులో జీరో పాయింట్ నుండి 8 వ కిలో మీటరు వద్ద గత వారం రోజుల క్రితం వర్షాల కారణంగా కే ఎల్ ఐ డి 5 మైనర్ కాల్వ నీటి ప్రవాహం ఎక్కువ కావడం తో కాల్వ తేగడం జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని టిఆర్ఎస్ మండల నాయకుల ను ఆదేశించారు మంత్రి ఆదేశాల ప్రకారం సోమవారం మండల టిఆర్ఎస్ మండల నాయకులు కే ఎల్ ఐ డి 5 మైనర్ కాల్వ పనులు ను పరిశీలించి మరమ్మతులు చేయిస్తున్నారు మరో మూడు రోజుల్లో పూర్తిస్థాయి లో మరమ్మతులు పూర్తవుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ , టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కోదండం, మండల రైతుబంధు అధ్యక్షులు తిరుపతయ్య యాదవ్, సీనియర్ నాయకులు మంద కోటేశ్వర్ రెడ్డి, మన్యం నాయక్, తదితరులు పాల్గొన్నారు.