కొండపై కొలువుదీరిన వెంకన్న
ఘనంగా స్వామి వారి కళ్యాణం
వైభవంగా ప్రారంభమైన బుగులోని జాతర
రేగొండ జనంసాక్షి : మండలంలోని తిరుమలగిరి శివారులో ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది.
భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బుగులోని వెంకటేశ్వర స్వామి సోమవారం ప్రత్యేక పల్లవి సేవలో గుట్టపైకి చేరారు. గుట్ట కింద ఉన్న ఇప్ప చెట్టు చుట్టూ తిరిగి గుట్టకు చేరడంతో జాతర ప్రారంభమైంది. వంశియ అర్చకుడు కురుమాచలం వెంకటేశ్వర్లు ఇంట్లో కొలువైన స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుమలగిరి గ్రామస్తులైన మచ్చిక రాజా గౌడ్, గ్రామానికి చెందిన కొంతమంది సొంత డబ్బులతో స్వామివారికి ఊరేగింపు కోసం ప్రత్యేక రతాన్ని చేపించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఈ రథంలో డప్పు చప్పుళ్ళు మేళ తాళాలు కోలాటాల నడుమ ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి తరలించారు. ఊరేగింపుగా వెళుతున్న స్వామివారికి భక్తులు అడుగడుగునా మంగళ హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి నీరాజానాలు పలికారు. సాయంత్రం గుట్ట కింద ఉన్న శివాలయం ప్రాంగణంలో అలివేలు మంగ పద్మావతులతో స్వామివారి వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సతీసమేతంగా స్వామివారిని కొండా సురికలో నేరిసిన ప్రాంతానికి చేర్చారు. స్వామివారి రాకతో గుట్టపైన ఉన్న గండ దీపాన్ని వెలిగించారు, దీంతో ప్రకృతి రమణీయత ఉట్టిపడే గుట్టలకు కార్తీక పౌర్ణమి కాంతులు ఉ లుముకున్నాయి, పచ్చని ప్రకృతి పౌర్ణమి కాంతులు విద్యుత్ వెలుగుల నడుమ బుగులోని కొండలు భక్తులను అల్లరించేందుకు సిద్ధమయ్యాయి. నేడు మంగళవారం రోజున చంద్రగ్రహణం కారణంగా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనం బంద్ ఉంటుందని ఆలయ అర్చకులు కురుమాచలం వెంకటేశ్వర్లు తెలిపారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జాతర ఈవో శ్రీనివాస్, చైర్మన్ కడారి జనార్ధన్ తెలిపారు. రేగొండ ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ఊరేగింపులో బందోబస్తు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సర్పంచ్ కట్ల రాణి మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ గంట గోపాల్, పిఎసిఎస్ డైరెక్టర్ సుదర్శన్ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
కొండపై కొలువుదీరిన వెంకన్న




