Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి పట్టణంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ 27వ వర్ధంతి వేడుకలు

 కోట్ల జగదీష్ కొండమల్లేపల్లి జనవరి 18 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో బుధవారం నాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మకుటం లేని మహారాజు తెలుగు జాతికి ఆదర్శప్రాయుడైన స్వర్గీయ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి వేడుకలు కొండమల్లేపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కోట్ల జగదీష్, టిడిపి జిల్లా నాయకులు వస్కుల కృష్ణయ్య, బోడ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా చౌరస్తాలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరపురాని జ్ఞాపకం తెలుగు జాతి గౌరవం ఎన్టీఆర్ అని తెలుగు వాడి సత్తా దశదిశలా వ్యాపింపజేసిన, నవరస నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చౌరస్తా సెంటర్ లో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బోడ యాదయ్య, ఇస్లావత్ సురేష్ నాయక్, గుంటోజు జానాచారి, గుంటోజు శంకరాచారి, అంజన్ గౌడ్, నేలపట్ల గిరి, పందుల కోటయ్య, గాలం వెంకటరమణ, రాము మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు