హైదరాబాద్,జూన్5(జనం సాక్షి ): కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్స్, ఫార్మసీ, ఓపీ, ఐపీ వార్డులతో పాటు పలు విభాగాలను మంత్రి పరిశీలించి.. రోగులను పరామర్శించారు. అనంతరం ప్రసూతి వార్డులో బాలింతలకు కేసీఆర్ కిట్లను మంత్రి అందజేశారు. కేసీఆర్ కిట్ పథకంపై బాలింతలను అభిప్రాయం అడగ్గా.. ఈ పథకం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. గతంలో ఎన్నడూ.. ఇలాంటి పథకాలు తాము చూడలేదని.. కేసీఆర్ కిట్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని బాలింతలు అభినందించారు. ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు బాగున్నాయని రోగులు.. మంత్రికి తెలిపారు.




