Friday, 6 November 2026

కొండాపూర్ డివిజన్ మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా షేక్ రెహమతుల్లా… ఉత్తర్వులు అందజేసిన బిజెపి నేత రవి కుమార్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 25( జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధి కొండాపూర్ డివిజన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా షేక్ రెహమతుల్లా నియమితులైనారు. ఈ మేరకు రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గురువారం ఆయన ఉత్తర్వులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడిని సొంత కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిజాయితీగా పాటుపడే ఏకైక పార్టీ బిజెపి అని ఆయన అభివర్ణించారు. అధికార దాహంతో గద్దెనక్కాలని భావించే కొంతమంది తమ పబ్బం గడవడానికి స్థానిక సమస్యలను, సున్నితమైన అంశాలను, మతవిద్వేషాలని రెచ్చగొడుతూ అత్యంత నీచమైన పద్ధతులను అవలంబిస్తున్నారని వారు దుయ్యబట్టారు. దేశంలో ఎంతోమంది ముస్లిం సోదరులు భారతీయ జనతా పార్టీలోసముచిత స్థానంలో తగర్వంగా ముందుకు సాగుతున్నారని, అలాంటివారు దేశ భద్రత కోసం, జాతీయ భావం పెంపుదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ రహమతుల్లా మాట్లాడుతూ భారతదేశంలో లౌకికతత్వం కలిగిన ఏకైక పార్టీ బిజెపి అని, బిజెపితోనే దేశభద్రత, సార్వభౌమత్వం నిలబడతాయన్నారు. మతతత్వ శక్తులు హిందూ, ముస్లిం అవిద్వేషాలని రెచ్చగొట్టి నగరంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని అలాంటి వారికి తప్పకుండా తాము సమాధానం చెబుతామని రహమతుల్లా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శేరిలింగంపల్లి కోటపై కాషాయపు జెండాను ఎగరేసి తీరుతామని, ఇందుకోసం బిజెపి కార్యకర్తలు సైనికులై ముందుకు సాగుతారని రవి కుమార్ యాదవ్, రహమతుల్లా ధీమాను వ్యక్తం చేశారు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి నిజాయితీగా శ్రమిస్తానని రహమతుల్లా అన్నారు. కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, రామిరెడ్డి, కుమారస్వామి, శంకర్, షాబుద్దీన్, దిలీప్, రాకేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.