Thursday, 5 November 2026

కొడకంచి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్లకు షోకేజ్ నోటీసు.

 

 

 

 

 

 

 

 

జిన్నారం మే 18(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం కొడకంచి గ్రామపంచాయతీ పరిధిలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శి సాధన ను గ్రామంలో పరిశుద్ధ పనులు లో విఫలమైనందున పంచాయతీ సెక్రెటరీనీ సస్పెండ్ చేస్తూ, అలాగే అవేంషు ప్లాంటేషన్, మరియు మురికి కాలువలను రోడ్లను శుభ్రం చేయుటలో, డంపింగ్ యార్డ్, పొడి చెత్త వేరు చేయట్లలో విఫలమైనందున సర్పంచ్ శివరాజ్ కి మరియు ఉపసర్పంచ్కి షోకేజ్ నోటీసులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి ఫోకజ్ నోటీసులు అందజేసినారు!! ఈ సందర్భంగా డి.పి.ఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వీధి దీపాలు డంప్యాడ్లు మురికి కాలువలను రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం పరుచుకోవాలని అదేవిధంగా వీధి దీపాలను కూడా సమయపాలనలో వెలిగించాలని, ఒక సర్పంచ్, ఉప సర్పంచ్లకే కాకుండా పంచాయతీ సభ్యులకు కూడా ఈ పూర్తి బాధ్యత ఉంటుందని అతను ఈ ప్రకటనలో తెలిపారు.